Soaked Walnuts:వాల్ నట్స్ నానబెట్టి తింటున్నారా… రోజుకి ఎన్ని తినాలో తెలుసా…
Soaked Walnuts:వాల్ నట్స్ నానబెట్టి తింటున్నారా… రోజుకి ఎన్ని తినాలో తెలుసా… మారిన పరిస్థితుల కారణంగా ఈ మధ్య కాలంలో Dry Fruits తినే వారి సంఖ్య బాగా పెరిగింది. కాస్త ధర ఎక్కువైనా వాటిని తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. Walnut లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు ధర ఎక్కువ అని వాల్ నట్స్ తినటానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.
కానీ మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు మనలో చాలా మంది వాల్ నట్స్ తింటున్నారు. వాల్ నట్స్ తినే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. Walnuts లో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తింటే అ మంచిది.
Walnuts… చూసేందుకు ఇవి చిన్నపాటి మెదడు ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి మన శరీరానికి అందించే ప్రయోజనాలు మాత్రం పుష్కలం. వాల్ నట్ తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాల్ నట్స్ బిట్టర్ టెస్ట్ కలిగి ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండ వాల్ నట్స్ తినటం అలవాటు చేసుకుంటారు.
Walnuts మెదడు ,మెమొరీకి మంచిదని అందరూ భావిస్తారు. అయితే వాల్ నట్స్ ని సరైన విధంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యానికే కాకుండా ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి ఇస్తుంది. చాలా మందికి రోజుకి ఎన్ని వాల్ నట్స్ తినాలో అనే సందేహం ఉంటుంది. రోజుకి రెండు లేదా మూడు వాల్ నట్స్ తింటే సరిపోతుంది.
అలాగే చాలా మందిలో మరొక సందేహం కూడా ఉంది. అది ఏమిటంటే Walnuts నానబెట్టి తినాలా లేక మాములుగా తినాలా? నానబెట్టి తింటేనే మంచిది. వాల్ నట్స్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తొక్క తీసి తినాలి. లేదంటే.. ఈ తొక్క ద్వారా మన శరీరానికి ఎక్కువ హాని కలుగుతుంది. వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి.
Walnut లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వాల్ నట్స్ ని నానబెట్టి తినటం వలన రక్తంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే అదే సమయంలో మంచి కొలస్ట్రాల్ ని పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో గుండె వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి.
మధుమేహం ఉన్నవారు రోజుకి రెండు Walnuts తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల.. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. శరీరంలో క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను పూర్తీగా నాశనం చేస్తాయి. వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని తగ్గిస్తుంది. కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు వాల్ నట్స్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.