MoviesTollywood news in telugu

Srikanth: శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరోనే..కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడు

Tollywood Hero Anil:ప్రముఖ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంటారు. ‘అఖండ’ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా మారిన శ్రీకాంత్, తన సోదరుడు కూడా నాయకుడిగా ఒక సినిమాలో నటించాడు.

శ్రీకాంత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు. చిరంజీవిని ఆదర్శంగా చూసుకొని, ఆయన ప్రేరణతో ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రముఖ హీరోగా ఎదిగారు. మొదట విలన్ పాత్రలను పోషించిన శ్రీకాంత్, తర్వాత హీరోగా మారారు. ఆయన కథానాయకుడిగా చాలా హిట్ సినిమాలను చేసారు. హీరోగా తన కెరీర్ బాగా సాగకపోవడంతో, ప్రస్తుతం విలన్ మరియు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ వ్యక్తిగత జీవితంలో, అప్పటి హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు (రోషన్, రోహన్, మేధా) ఉన్నారు. శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ.. తనకంటూ సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు.

శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా ఒకప్పుడు హీరోగా ఎదగాలని ప్రయత్నించాడు, ‘ప్రేమించేది ఎందుకమ్మ’ అనే సినిమాలో నటించి. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో, అనిల్‌ హీరోగా గుడ్ బై చెప్పేసి.. శ్రీకాంత్‌తో ‘విరోధి’ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవటంతో.. అనిల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ