Hair Care Tips:అరటిపండుతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Care Tips:అరటిపండుతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది, ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంది పలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే జుట్టు కి సంబంధించి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ ప్యాక్ కోసం 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండును మెత్తని పేస్ట్ గా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల తేనే,ఒక స్పూన్ ఆలివ్ oil,egg తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించాలి.
అరగంట అయ్యాక హెర్బల్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతంది. అరటిపండులో ఉండే పొటాషియం జుట్టును పటిష్టం చేయడానికి మరియు చిట్లడాన్ని తగ్గిస్తుంది.
తేనె అనేది సహజమైన హ్యూమెక్టెంట్, అంటే ఇది జుట్టులో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు పొడిగా మరియు పెళుసుగా మారకుండా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు మరియు తలపై పోషణను అందించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
గుడ్లులో ప్రొటీన్ మరియు బయోటిన్ సమృద్దిగా ఉండుట వలన జుట్టు బలానికి మరియు పెరుగుదలకు అవసరం. కాబట్టి కాస్త ఓపికగా ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News