Jaggery and Chana Benefits: శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!
Jaggery and Chana Benefits: మన శరీరాన్ని బలంగా ఉంచడానికి ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మరియు మినరల్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బెల్లం మరియు శనగలు అనేవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శనగలు మరియు బెల్లం కలిపి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఉదయం శనగలు మరియు బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయామం చేసే వారు, జిమ్‌కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉండడంతో జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు శనగలు మరియు బెల్లం తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ 100 గ్రాముల శనగలు తినడం ద్వారా శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఎసిడిటి సమస్యను తగ్గించడంలో బెల్లం మరియు శనగలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇవి జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ఈ ఆహారాలను డైట్‌లో చేర్చడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్‌ను మేరుగుపరచటం ద్వారా మెదడు పనితీరు బాగుంటుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది.
శనగలు మరియు బెల్లం కలిపి తినడం వల్ల ఎముకలు మరియు దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో పాస్పరస్ దంతాలను బలపరుస్తుంది.
గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు మరియు బెల్లం సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చడం మంచి ప్రయోజనం కలుగుతుంది.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు శనగలు మరియు బెల్లం కలిపి తినవచ్చు. ఈ రెండింటిలో ఐరన్ సమృద్దిగా ఉండడం వల్ల, రక్తంలో ఆక్సిజన్ మరియు ఎర్ర రక్తకణాలను పెంచి రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ