Kitchen Hacks:ఈ నూనెతో స్ప్రే చేస్తే ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు..
Kitchen Hacks:ఈ నూనెతో స్ప్రే చేస్తే ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేసుకోవచ్చు.. వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
వీటిని వదిలించుకోవడానికి అనేక మస్కిటో కాయిన్స్, అగరత్తులు, లిక్విడ్లు ఉపయోగిస్తారు. కానీ వీటి నుంచి వచ్చే పొగను పిల్చితే శ్వాస కోశ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు చెప్పే నూనెలను ఉపయోగిస్తే ఎటువంటి సమస్యలు లేకుండా చాలా సులభంగా దోమలను ఇంటి నుండి తరిమేయవచ్చు.
వేప నూనె: వేపలో ఎన్నో పోషకాలు ఉండుట వలన పురాతనకాలం నుండి వాడుతున్నారు. వేపతో అనేక అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. వేప నూనెతో దోమల సమస్యను తగ్గించవచ్చు. ఒక స్ప్రే బాటిల్లో వేప నూనె, కొద్దిగా నీళ్లు పోసి బాగా షేక్ చేయండి. ఈ మిశ్రమాన్ని మూలల్లో, మంచాల కింద, దోమలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో స్ప్రే చేస్తే, ఆ వాసనకు దోమలు పోతాయి. దోమలు కుట్టకుండా ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ కూడా దోమల నివారణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ వాసన దోమలకు అస్సలు నచ్చదు. అలాగే ఈ oil ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్దిగా ఉండుట వలన దోమలు కుట్టడం వల్ల వచ్చే దద్దర్లు కూడా ఈ ఆయిల్‌తో తగ్గించు కోవచ్చు. అర కప్పు కొబ్బరి నూనెలో పది చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి ఇళ్లంతా స్ప్రే చేయండి. ఈ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ