Kadapa Karam Dosa:కడప కారం దోశ Perfect గా రావాలంటే ఇలా చేయండి
Kadapa Karam Dosa:కడప కారం దోశ Perfect గా రావలంటే ఇలా చేయండి..తెలుగు వారి ఫేవరేట్ టిఫిన్స్ లో దోశ గురించి చెప్పేది ఏముంది,ప్రతి రోజు మనం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ లేదా ఉప్మా లేదా dosa వేసుకుంటూ ఉంటాం.
ఎప్పుడు వేసుకొనే dosa కాకుండా కాస్త వెరైటీగా dosa వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో చేసేది ఒకే పిండి,దోశలు మాత్రం ఎన్ని వెరైటీలో,..కడప స్టైల్ కారం దోశ ఒక్కసారి ట్రై చేసారంటే,నాలుక చుర్రుమన్నా సరే నో చెప్పకుండా తినేస్తారు.
కావాల్సిన పదార్ధాలు
దోశపిండి కోసం
మినపప్పు – 1 కప్పు
బియ్యం – 3 కప్పులు
మెంతులు – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
ఎర్రకారం కోసం..
ఎండు మిర్చి – 20 – 25
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉల్లిపాయలు – 2
పప్పుల పొడి కోసం..
వెల్లుల్లి – 6
శనగపప్పు – పుట్నాల పప్పు – 1/2కప్పు
ఉప్పు – తగినంత
బొంబాయి చెట్నీ
చింతపండు – నిమ్మకాయ సైజ్
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
పసుపు – 1/4టీ స్పూన్
ఆవాలు- 1/2టీ స్పూన్
మినప్పు – 1 టీస్పూన్
జీలకర్ర – ½ స్పూన్స్
నూనె – 2 స్పూన్స్
అల్లం – ½ టీస్పూన్
పచ్చిమిర్చి – 1 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
తయారీ విధానం
1.నాలుగు గంటలు నాపెట్టిన మినపప్పు, బియ్యం, మెంతులను, మెత్తగా రుబ్బుకుని, 12 గంటల పాటు,పులియనివ్వాలి.
2.ఇప్పుడు పులిసిన పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుని, దోశ బ్యాటర్ రెడీ చేసుకుని,పక్కన పెట్టుకోవాలి.
3.ఎర్రకారం కోసం వేడి నీళ్లలో ఎండుమిరపకాయలు వేడి నీళ్లలో నానపెట్టి, నానిన మిర్చిని,
4.మిక్సీ జార్లోకి వేసి, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి, మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
5.పప్పుల పొడికోసం మిక్సీ జార్ లోకి వెల్లుల్లి, పుట్నాలు, వేసి మెత్తని పొడ చేసుకోవాలి.
6.ఇప్పుడు బొంబాయి చెట్నీ కోసం నానపెట్టిన చింతపండు రసం తీసి, అందులో శనగపండి నీళ్లు,ఉప్పు వేసి గడ్డలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
7.ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులోకి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర,
కరివేపాకు, పచ్చిమిచ్చి, అల్లం , పసుపు వేసి వేపుకోవాలి.
8.తాళింపు వేగాక, తయారు చేసుకున్న బొంబాయి చెట్నీని కలుపుకోవాలి.
9.ఒక పొంగు వచ్చేవరకు, ఉడికించి, తగినంత ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.ఇప్పుడు స్టవ్ పై దోశ పెనం పెట్టకుని, పెనం బాగా వేడెక్కిన తర్వాత అట్టు వేసి, దోశ వేసుకుని అంచులకు ఆయిల్ వెయ్యాలి.
11.దోశ కాస్త కాలుతుండగా, మధ్యలో నెయ్యి వేసి, మంట తగ్గించి ఎర్రగా వేపుకోవాలి.
12.ఎర్రగా కాలిన తర్వాత అట్టును తిరగ తిప్పుకుని, మళ్లీ తిప్పుకోవాలి.
13.ఇప్పుడు ఆ దోశపై వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కారం వేసి అంతటా స్ప్రెడ్ చేసి పల్లీల పొడి చల్లు కోవాలి.
14. ఒక నిముషం తర్వాత మధ్యలోకి మడుచుకుని సెర్వ్ చేసుకోడమే..
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ