Beauty Tips

Hair Care: జామ ఆకులతో ఇలా చేశారంటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది!

Hair Care: జామ ఆకులతో ఇలా చేశారంటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. ప్రస్తుతం ఎవర్ని కదిపినా జుట్టు రాలిపోతుందని చెబుతూనే ఉంటున్నారు. జుట్టుకు అవసరమైన పోషకాలు అందక జుట్టు అనేది బలహీన పడుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ జుట్టు రాలి పోతుంది. అంటే కాకుండా జుట్టు తెల్లగా మారుతుంది.

జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటే.. మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. తల చర్మం లోపల కొల్లాజెన్ దెబ్బ తినడం వల్ల జుట్టు కుదళ్లు బలహీనంగా మరి జుట్టు రాలిపోతుంది. అయితే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఖరీదైన షాంపూలు, రక రకాల నూనెలు వాడి ఉంటారు. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్సే తప్ప సరైన విధంగా ఫలితాలు ఉండవు. జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి జామ ఆకులు అనేవి బాగా ఉపయోగ పడతాయి.

జామ ఆకులో ఉండే విటమిన్ సి, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండిటి కలయిక వల్ల జుట్టు కుదుళ్ల లో కొలాజిన్ ప్రొడక్షన్ బాగా పెరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

జామాకులో ఉండే లైకోపిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎండ యొక్క యు వి కిరణాల నుండి జుట్టును రక్షించడానికి సహాయపడుతుంది. దీని కోసం జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. పైన చెప్పిన ఏ పద్దతి ఫాలో అయిన పర్వాలేదు. జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ