Movies

బిగ్ బాస్ 2 ని కాదని ఢీ 10 కి వస్తున్నా ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసాడు. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కారణంగా తెలుగులో బిగ్ బాస్ షోకి ఎవరు ఊహించని క్రేజ్ వచ్చింది. అలాగే అదే రేంజ్ లో TRP రేటింగ్స్ కూడా ఉన్నాయి. అయితే సినిమాలతో చాలా బిజీగా ఉండుట వలన బిగ్ బాస్ రెండో సీజన్ కి హోస్ట్ గా చేయలేదు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. అయితే హోస్ట్ గా మాత్రం కాదు. ఈ టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ డాన్స్ షో ఫైనల్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబందించిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ వారాంతంలో ఎన్టీఆర్ పాల్గొన్న షో ప్రసారం అవుతుంది.

టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. డాన్స్ ప్రధానంగా సాగే ఢీ 10 కి ఆయనను అతిధిగా ఆహ్వానించారు. ఢీ 10 పార్టిసిపెంట్స్ వేసిన డాన్స్ లను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారట. డాన్స్ బాగా చేసిన పార్టిసిపెంట్స్ ని ఎన్టీఆర్ మెచ్చుకున్నారట. యంగ్ జనరేషన్ లో చాలా టాలెంట్ ఉందని అన్నారట.

ఢీ 10 కార్యక్రమానికి ప్రియమణి,శేఖర్ మాస్టర్,యాని మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ ప్రదీప్ ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు సుదీర్,రేష్మి చేసిన హంగామా చూసి తీరాల్సిందే.