Movies

మీనా ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా…. నమ్మలేని నిజాలు

కళ్ళతోనే భావాలు పలికించగల అతి కొద్ది మంది హీరోయిన్స్ లో మీనా ఒకరు. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దక్షిణాది అన్ని భాషల్లోనూ మీనా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మీనాకు జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. మీనా స్వస్థలం చెన్నయ్. తండ్రి దొరైరాజా తెలుగు మూలాలను కలిగి ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేవారు. తల్లి రాజమల్లిక సినీ నటిగాను,రాజకీయ నాయకురాలిగాను ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా నేపధ్యం గల కుటుంబం కావటంతో మీనా బాలనటిగా సినీ పరిశ్రమకు వచ్చింది.

తెలుగులో నవయుగం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. సీతారామయ్య మనవరాలు ఆమె కెరీర్ లో మంచి మలుపు అని చెప్పవచ్చు. అక్కడ నుండి పెద్ద హీరోలతో సినిమాలు చేసి స్టార్ డమ్ ని అందుకుంది. చంటి,అల్లరి మొగుడు,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,ముఠామేస్రి, సూర్యవంశం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

ఒక పక్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళంలో కూడా నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రజనీకాంత్,విజయకాంత్,కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అంతేకాక చిన్నతనంలో భరతనాట్యం కూడా నేర్చుకుంది. మీనాకు తమిళం,కన్నడ,మలయాళ,తెలుగు,హిందీ,ఇంగ్లిష్ ఆరు భాషలు బాగా వచ్చు.

చిన్నతనంలోనే సినిమాల్లోకి రావటం వలన ఆమె 8 వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 10 వ తరగతి పూర్తి చేసింది. బెంగుళూర్ లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది. వీరి వివాహం పెద్దలు కుదిర్చారు.

మీనా వివాహం 2009 లో తిరుపతిలో చాలా వైభవంగా జరిగింది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసారు. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. నైనికా తల్లి బాటలోనే సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో చాలా సినిమాల్లో బాలనటిగా నటిస్తుంది.

మీనా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ కూతురు నైనిక కెరీర్ మీద ద్రుష్టి పెట్టింది. ఆ మధ్య దృశ్యం సినిమాలో కనిపించి అందరిని అలరించింది. రోజా మీనా మంచి స్నేహితులు. ఆ మధ్య మీనా కూతురు పుట్టినరోజు వేడుకల్లో రోజా చేసిన హంగామా కోలీవుడ్ హాట్ టాపిక్ అయింది.