Movies

బిగ్ బాస్ మీరిది గమనించారా… గీతా,బాబుల నిశబ్ద యుద్ధం

బిగ్ బాస్ సీజన్ 2 భారీ అంచనాలతో నాని హోస్టింగ్ తో జూన్ 10 న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రేక్షకులు ఊహించిన విధంగా లేకపోయినా TRP రేటింగ్స్ పరంగా సత్తా చాటుతూ ముందుకు దూసుకువెళ్ళుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 కి విన్నర్ ఎవరు అనే ప్రశ్నకు మొదటి నుండి బాబు గోగినేని,సింగర్ గీతా మాధురి పేర్లు ఎక్కువగా విన్పించాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 2 విజేత అయ్యే విధంగా ఫెర్ఫామెన్స్ గీతా మాధురి ఇప్పటివరకు ఇవ్వలేదనే చెప్పాలి. బాబు గోగినేని చాలా బిన్నంగా ప్రవర్తిస్తూ తనకు నచ్చని విషయాన్నీ చేయనని చెప్పుతూ,బిగ్ బాస్ కె వార్ణింగ్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఒక భావనను కలిగించారు. ఇప్పటికే బాబు గోగినేని మీద పేస్ బుక్ లో ఫన్నీ ట్రోలింగ్ ని ప్రారంభించేసారు. బాబు గోగినేని బిగ్ బాస్ విజేత అని ట్రోలింగ్ చేస్తున్నారు,అయితే ఇప్పుడు వీరిద్దరి గురించిన ఒక వార్త హల్చల్ చేస్తుంది.

వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో మౌనంగా ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా నిశబ్ద యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేక్షకులు వీరిద్దరిని జాగ్రత్తగా గమనిస్తే వీరిద్దరికి స్ట్రాంగ్ ఇగో ఫీలింగ్ తో కదిలిస్తే కస్సు మానేలా ప్రవర్తన ఉంటుంది. వీరిద్దరూ ఒకరి కొకరు ఫైనల్ విన్నర్ కి స్ట్రాంగ్ పార్టిసిపెంట్స్ అని భావిస్తున్నారేమో.

బాబు గోగినేని సామ్రాట్ దగ్గరకు వెళ్లి తేజస్వి భోజనం చేయలేదని, ఎందుకో కనుక్కోమని చెప్పితే…అప్పుడు గీతా మాధురి మీరు చూసారా ఆమె భోజనం చేసింది అని కౌంటర్ ఇచ్చింది. అప్పుడు బాబు గోగినేని మీతో నేను మాట్లాడటం లేదు.

నేను సామ్రాట్ తో మాట్లాడుతున్నా… మధ్యలో మీరు ఎందుకు వస్తారు అంటూ రీ కౌంటర్ వేయటంతో గీతా మాధురి నాదే తప్పు సారి చెప్పగా… బాబు గోగినేని అవును మీదే తప్పు అని కౌంటర్ ఇవ్వటం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

ఇలా చిన్న చిన్న విషయాలకే చిర్రు బుర్రులాడుకుంటున్న వీరిద్దరూ ఎపుడో ఒకఅప్పుడు బరస్ట్ అయ్యి పెద్ద గొడవకు దారి తీయవచ్చని పరిస్థితులు చెపుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం ముందు ఉన్న నిశబ్ద వాతావరణం కొనసాగుతుంది. ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం.