Movies

పవన్ అభిమానులను చీల్చి చెండాడిన రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ రెండో భార్య తాను మరో వివాహానికి సిద్ధం అని సంకేతాలు ఇస్తున్న ఈ తరుణంలో రెండో పెళ్లి వద్దని చెప్పిన ఒక అభిమానికి ఘాటైన సమాధానం చెప్పింది. మేడం మీరు రెండో వివాహం చేసుకోవద్దు. ఆలా చేస్తే బయటివారికి మీకు తేడా ఏమి ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ మీ లాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్ధం కావటం లేదని కామెంట్ చేసాడు. దీనికి స్పందించిన రేణు దేశాయ్ ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారు తల్లులు,అక్కాచెల్లెళ్లలతో ఎలా ప్రవర్తిస్తారో వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్న అని అన్నది రేణు. మరొక అభిమాని మీరు మరల పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి.

నా దేవుడికి ఎలాంటి సమస్య రాకూడదు…ఏమి చేసిన బాగా అలోచించి చేయండని కామెంట్ పెట్టగా దానికి రేణు క్రేజి అని కామెంట్ చేసింది. కొంతమంది రేణు పెళ్ళికి మద్దతు పలకగా, వారికీ రేణు పేరు పేరున ధన్యవాదాలు చెప్పటమే కాకా, వారిని పెంచిన తల్లితండ్రులకు కితాబునిచ్చింది.