Dry Coconut : ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాలో తెలుసా 

ఎండు కొబ్బరి తింటే ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరిలో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఎండు కొబ్బరిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.

రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎండు కొబ్బరిలోని పోషకాలు అధిక రక్తపోటును నివారించడంలో కూడా సాయపడతాయి.

మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఉదయం పూట ఎండు కొబ్బరి తింటే రక్తహీనత దరిచేరదు. శరీరంలో హిమోగ్లోబిన్‌ని కూడా పెంచుతుంది.

ఎండు కొబ్బరిలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.