వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!

వారానికి ఒక గ్లాస్ చొప్పున స్వచ్ఛమైన పచ్చి చెరకు రసం తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు

కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

పోషకాలు అధికంగా ఉండే చెరకు రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఈ జ్యూస్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

శరీరం చల్లగా ఉండాలంటే చెరుకు రసం తాగడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది

చెరకు రసంలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి కాలేయాన్ని రక్షిస్తుంది.

చెరకు రసం జీర్ణ సమస్యలకు టానిక్‌గా పనిచేస్తుంది.

అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది పొట్టలో పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి కూడా పనిచేస్తుంది.

చెరకు రసం గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B9 కలిగి ఉంటుంది.

రక్తహీనతతో బాధపడేవారికి చెరకు మరియు దాని రసం చాలా మేలు చేస్తుంది.