ఉదయాన్నే అంజీర్‌ వాటర్ తాగండి..

అంజీర్‌లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ కె,కాల్షియం,పొటాషియం,మెగ్నీషియం,ఐరన్,ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఉదయాన్నే అంజీర్ నీరు తాగడం వల్ల ప్రేగు కదలికలు సులభమవుతాయి . కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

అంజీర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి . ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, బరువు నియంత్రణలో ఉంటుంది.

అంజీర్‌లో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంజీర్‌లో ఒమేగా 3 , ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అంజీర్‌లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

అంజీర్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అంజీర్‌లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అంజీర్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

అంజీర్ సహజ చక్కెరలకు మంచి మూలం. ఉదయాన్నే అంజీర్ నీరు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది .