రేణు దేశాయ్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అన్నా లెజినోవా
ఒక్కోసారి కొన్ని ఘటనలు ఎదురు అవుతూ ఉంటాయి. అవి సంతోషకరం కలిగించేది కావచ్చు,ఆందోళన,విచారం కల్గించేవి కావచ్చు. ఇప్పుడు రేణు విషయంలో అదే జరిగింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి స్వయంగా స్పందించాడు. రేణు తనకు కాబోయే జీవిత భాగస్వామితో కల్సి ఉంగరాలు మార్చుకుంటూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిశ్చితార్ధం నాటి ఫోటోలను పెట్టింది కానీ, తనకు కాబోయే భర్త మాత్రం ఎవరో ఇంతవరకూ వెల్లడించలేదు. ఈ రహస్యం వెల్లడించకపోయినా రేణు నిర్ణయంపై నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక రేణుకి విడాకులు ఇచ్చినప్పటికీ అప్పుడప్పుడు పూణే వెళ్లి,రేణుని, అలాగే పిల్లలు అకిరా, ఆద్యలను చూసి వస్తున్నాడు.
ఇక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వచ్చిన పోస్ట్ పై స్పందించడం వెనుక పవన్ భార్య అన్నా లెజినోవా ఉందట.రేణు ఒంటరిగా ఉండడంపై లెజినోవా లో పశ్చాత్తాపం ఉండేదట. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు రేణు స్వయంగా వెల్లడించడంతో అందరికన్నా ఎక్కువగా లెజినోవా ఆనందిస్తోందట.
అందుకే ఆమె స్వయంగా పవన్ ని ప్రోత్సహించి ట్వీట్ చేయించిందట. అందుకే లేటుగా స్పందించినా సరే, లేటెస్ట్ గా తన సహజత్వానికి భిన్నంగా’రేణు గారు’అంటూ తన మాజీ భార్యను గౌరవంగా సంబోధిస్తూ, ఆమె కొత్తజీవితం బాగుండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసాడు పవన్. ఇంతకీ ఈ ట్వీట్ ని లెజినోవా దగ్గరుండి పవన్ చేత పోస్ట్ చేయించి, రేణుకు తన మాజీ భర్తనుంచి సర్ ప్రయిజ్ గిఫ్ట్ అందించేలా చేసింది లెజినోవా.