Movies

అనుష్క పెళ్లి ఫిక్స్…పెళ్ళికొడుకు ఏమి చేస్తాడో తెలుసా?

హీరో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసేదే. టాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన హీరోయిన్స్ సైతం పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయి చేస్తుంటే, స్వీటీ బ్యూటీ అనుష్క మాత్రం ఇంకా వెయిటింగ్ లోనే కనిపిస్తోంది. పోనీ వయస్సు రాలేదా అంటే అది కాదు. ఎందుకంటే ఆమె వయస్సు ఎప్పుడో 30 దాటింది. ఎన్నో ఊహాగానాలు వినిపించినప్పటికీ వరుసగా అంగీకరించిన సినిమాలు పూర్తయ్యాక పెళ్లి వార్త చెబుతుందని అందరూ భావించారు. అయితే బాహుబలి చిత్రాలతో ఏళ్లకు ఏళ్ళు గడిపేసిన అనుష్క ఆతర్వాత భాగమతితో బిజీ అయిందే తప్ప, పెళ్లి ఊసు ఎత్తలేదు. ఇక మ్యారేజ్ గురించి చెప్పి, ఆమె పేరెంట్స్ కూడా విసిగిపోయారన్న టాక్ వినిపించింది.

పోనీ అనుష్క ప్రేమలో పడిందా అనే సందేహం తలెత్తిన వెంటనే స్ఫురించేది ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్, అనుష్కల నడుమ వచ్చిన రూమర్స్ మరే హీరో హీరోయిన్స్ మీద రాలేదని చెప్పాలి. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా అప్పుడప్పుడు కల్సుకుంటారని,సందర్భాన్ని బట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారని కూడా టాక్.

ఇక నేషనల్ సినీ క్రిటిక్ అయితే మరో అడుగు ముందుకేసి,అనుష్క – ప్రభాస్ లు ప్రేమలో నిండా మునిగారని,ట్వీట్ చేయడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీంతో స్వయంగా ప్రభాస్ రంగంలోకి వచ్చి అలాంటిదేమీ లేదని స్పష్టం చేయడంతో మళ్ళీ ఆ ఊసు వినబడలేదు.
అయితే మళ్ళీ ఇన్నాళ్లకు జేజమ్మ పెళ్లి వార్త మళ్ళీ తెర మీదికి వచ్చింది. భాగమతి తర్వాత ఏ సినిమాకు ఒకే చెప్పని అనుష్క ప్రస్తుతం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తోందట.

దీనికి కారణం పెళ్లి ముందు కొన్ని దోషాలను నివారించుకోడానికే ప్రత్యేక పూజలకు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్తోందని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించడం విశేషం. దీంతో లేటెస్ట్ గా ఈ స్వీటీ పెళ్లి గురించి ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. దుబాయ్ లో సెటిల్ అయిన ఓ సంపన్న యువకునితో పెళ్లి కి సంప్రదింపులు జరుగుతున్నాయట. ఆ మధ్య అనుష్క దుబాయి వెళ్లడం సాహు షూటింగ్ కోసం కాదని,పెళ్లి ఫిక్స్ కోసమేనని అప్ డేట్స్ ని బట్టి అర్ధం అవుతోంది.

దుబాయ్ లో సెటిల్ అయిన కోటీశ్వరుడైన యువకుడు కూడా అనుష్కతో పెళ్ళికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని ఈ అందాల భామ చెప్పడాన్ని బట్టి, ఇప్పుడు దుబాయ్ సంబంధం దాదాపు ఖరారయినట్లేనని బలంగా వినిపిస్తోంది.