రోజా తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా…అందుకే రోజా ఎవరికి భయపడదు
అందం కన్నా అభినయం ముఖ్యమని, నలుపులోనూ అందం ఉంటుందని నిరూపించిన హీరోయిన్ రోజా,తెలుగు, కన్నడ,తమిళ మలయాళ భాషల్లో కథానాయికగా తన సత్తా చాటింది. సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా నిల్చిన రోజా రాజకీయాల్లో కూడా తనశైలి చాటుతోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి తనకు ఏమాత్రం అభిరుచి లేని సినీ రంగానికొచ్చి అందం కన్నా అభినయం గొప్పదని చాటిచెప్పింది. దాదాపు రెండువందల సినిమాల వరకూ నటించింది. వివిధ భాషల్లో నటించడం ఓ విశేషమైతే,నటించిన భాషలన్నిటిలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఘనత శ్రీదేవి తర్వాత రోజా కే చెల్లింది.ఇక రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఏలుతున్న ఈ రాయలసీమ ముద్దుగుమ్మ అందరిలా కాకుండా సినీ రంగంలో అనుకువగా కనిపించి, రాజకీయాల్లో పూర్తి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
మాటకు మాట ఎదురు చెప్పడమే కాదు ఎలాంటి నేతనైనా ఎదురొడ్డి నిలవడంతో తన సత్తా చాటుతోంది. ఎక్కడో మామూలు అమ్మాయి సినీ రంగంలోకి రావడం,ఆతర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకోవడం సామాన్య విషయం కానేకాదు. ఈ స్థాయికి చేరిన రోజా పడ్డ శ్రమతో పాటు కుటుంబ మద్దతు కీలకంగా నిల్చింది. రోజా ఫామిలీ లో తండ్రి నాగరాజారెడీ, తల్లి లలితా రెడ్డి మధ్య తరగతి ఫామిలీ. నాగరాజారెడ్డి డాక్యుమెంటరీలో సౌండ్ ఇంజనీర్. తల్లి లలిత నర్సుగా చేసేది.
చిత్తూరు జిల్లా బకరా పేట కు చెందిన ఈ దంపతులకు 1972లో రోజా జన్మించింది. ఈమె అసలు పేరు శ్రీలత. ఈమెకు కుమారస్వామి రెడ్డి,రామ్ ప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు సోదరులున్నారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో పాలిటికల్ సైన్స్ లో పిజి చేసిన రోజా 17ఏళ్ళ ప్రాయంలో సినీ ఛాన్స్ కొట్టేసింది. కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో రోజా ఫోటోలు చూసిన సినీ రంగ వ్యక్తులు ఆతర్వాత ఆమె కుటుంబాన్ని సంప్రదించారు.
ఇలా ప్రేమ తపస్సు మూవీ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన శ్రీలత రోజాగా రూపాంతరం చెందింది.
ఆతర్వాత సీతారత్నం గారబ్బాయి,బొబ్బిలి సింహం ,ముఠా మేస్త్రి, భైరవ ద్వీపం శుభలగ్నం,పోకిరి రాజా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ కి చేరింది. తమిళంలో ఆర్ కె సెల్వమణి డైరెక్షన్ లో చామంతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోజా అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయింది. మంచి పొజిషన్ లో ఉండగానే సెల్వమణి ప్రేమలో పడిన రోజా అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు హంసమాలిక అనే కూతురు,కృష లోహిత్ అనే కొడుకు ఉన్నారు.
ఇక సినిమాల్లో అడపాదడపా రోల్స్ చేస్తూ బుల్లితెరమీద జడ్జిగా ఉంటోంది. ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం సంగతి తెల్సిందే. వైస్సార్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ,ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంతేకాదు తమిళనటి ముంతాజ్ కూడా రోజాకు సన్నిహితురాలు. మొదట్లో వీరిద్దరి మధ్యా అసలు సంబంధం లేదు. అయితే 2003లో సింగపూర్ లో ఓ ఈవెంట్ లో పాల్గొన్న రోజాకు అక్కడ ముంతాజ్ కూడా తారసపడింది.
ముంతాజ్ హెయిర్ స్టైల్ సరిచేసుకోవడం, మేకప్ విషయంలో పడుతున్న ఇబ్బంది గమనించి రోజా సరిచేసింది. .దాంతో అప్పటికే స్టార్ హీరోయిన్ గా వున్న రోజా వ్యాంప్ పాత్రలు వేసే తనలాంటి నటి పట్ల ఎలాంటి భేషజం లేకుండా మంచిగా ప్రవర్తించి సహకరించడంతో ముంతాజ్ ఫిదా అయిపొయింది. ఆలా ఇద్దరి మధ్యన స్నేహ బంధం ఏర్పడింది. రోజా సింపుల్ సిటీ , సహాయ పడే మనస్తత్వాన్ని ఓ ఇంటర్యూలో కూడా ముంతాజ్ చెప్పింది.