Spicy tomato and bean rice:టమోటా బీన్స్ పలావ్ ఎలా తయారుచేయాలో తెలుసా?
కావలసినవి
తెల్ల బీన్స్ (సూపర్ మార్కెట్స్‌లో లభ్యమవుతాయి) 150 గ్రా., బాస్మతి బియ్యం 2 కప్పులు, టొమాటొ రసం 3 కప్పులు, పలావు ఆకు ఒకటి, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 2, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత.
తయారి విధానం
పలావ్ ఉదయం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి బీన్స్ ని నానబెట్టాలి. ఉదయం నానిన బీన్స్ లో నీటిని తీసేయాలి. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి నీటిని తీసేయాలి. ఒక బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి.
నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నిటినీ వేసి బాగా వేగించాలి. తర్వాత బాసుమతి బియ్యం వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత బీన్స్ కూడా వేసిన తర్వాత టొమాటొ రసం, ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మూత పెట్టాలి. టొమాటొ రసం ఇగిరి, బియ్యం ఉడికే వరకు ఉంచాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.