Politics

బాలకృష్ణ చిన్నల్లుడు సంచలన నిర్ణయం…. షాక్ లో బాలయ్య,చంద్రబాబు

రాజకీయాలు ఎల్లప్పుడూ ఒకేలా వుండవు. మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులు అవుతారు. టికెట్ కోసం రకరకాల ఎత్తుగడలూ సరే సరి. ఇప్పటికే నారావారి ఇంటినుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి,ఎమ్మెల్సీ అయిపోయి మంత్రిగా కూడా వెలిగిపోతున్నాడు. మరోపక్క నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా వున్నారు. అయితే బాలయ్య పెద్ద అల్లుడైన లోకేష్ మంచి పొజిషన్ లోనే ఉండగా, ఇప్పుడు మరో అల్లుడు కూడా రాజకీయ అరంగేట్రం కోసం ఉవ్విళ్ల్లూరుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే , వైజాగ్ లో గీతం విద్యా సంస్థలకు ఓ ఇమేజ్ వుంది. మాజీ ఎంపీ ఎవివిఎస్ మూర్తి దీని అధిపతి.

ఆయన మనుమడు శ్రీ భరత్ స్వయంగా బాలయ్య చిన్నల్లుడు. బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని భర్త అయిన శ్రీ భరత్ 2019ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నాడట. ఇందుకోసం జోరుగా పావులు కడుపుతున్నారట. గతంలో ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా వున్నారు.

అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైస్సార్ సిపి తరపున జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పోటీచేయగా, బిజెపి నుంచి పోటీచేసిన డాక్టర్ కె హరిబాబు నెగ్గారు. అప్పట్లో టిడిపి,బిజెపి మధ్య పొత్తు కారణంగా బిజెపి కి విశాఖ సీటు కేటాయించడంతో ఎంవీవీఎస్ మూర్తి ఏమీ అనలేకపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ , బిజెపి మధ్య బంధం తెగిపోవడంతో ఈసారి ఎలాగైనా తనకు సీటు ఇవ్వాలని మూర్తి కోరుతున్నారట.

ఒకవేళ కుదరని పక్షంలో తన మనవడు శ్రీ భరత్ కివ్వాలని వత్తిడి పెంచుతున్నారట. ఇప్పటిదాకా బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులకు సీటు ఇస్తున్నారని ఇప్పుడైనా తమకు దక్కాలని ఆయన పట్టుబడుతున్నారట. ఈదశలో శ్రీ భరత్ పోటీకి ఉత్సాహం చూపిస్తున్నాడట. మామగారు బాలయ్య, తోడల్లుడు నారా లోకేష్ అండదండలు ఎలాగూ ఉంటాయి.

కాబట్టి విజయం నల్లేరు బండిమీద నడకే కాగలదని శ్రీ భరత్ భావిస్తున్నాడు.కాగా టిడిపిలో సీఎం చంద్రబాబు నిర్ణయమే అంతిమం. ఈసారి మంత్రి గంటా శ్రీనివాసరావు ను వైజాగ్ నుంచి పోటీకి నిలపాలని భావిస్తున్నారట. మరోపక్క బావమరిది మాట తీయకుండా ఉండాలి. ఇలాంటి సంకట పరిస్థితిలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం గైకొంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.