మోక్షజ్ఞ ఎంట్రీకి అసలు సమస్య అదే అయితే ఎంట్రీ చాలా కష్టం…పాపం బాలయ్య
ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్,కృష్ణ,కృష్ణం రాజు,చివరకు శ్రీకాంత్ వరకూ అందరూ తమ వారసులను టాలీవుడ్ కి పరిచయం చేస్తూ,గ్రాండ్ ఓపెనింగ్స్ ఇచ్చారు. అయితే గత ఏడాది కాలం పైగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం గురించి చాలానే వార్తలు వచ్చినా ఈ మధ్య అసలు ఆ ఊసే లేదు. బాలయ్య సన్నిహితుడు సాయి కొర్రపాటి మోక్షజ్ఞ తొలి సినిమా తానే నిర్మిస్తానని చాలాసార్లు స్పష్టంచేశారు. ఇక మోక్షజ్ఞ కోసం ఓ టైటిల్ కూడా రిజిస్టర్డ్ చేసినట్లు వార్తలు పొక్కాయి. అయితే బాలయ్య చేయబోయే సినిమాల మీద మినహా మోక్షజ్ఞ ప్రస్తావన రావడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్, బోయపాటి సినిమా, వివి వినాయక్ తో మూవీ ఇలా బాలయ్య గురించి సినీ వార్తలు వస్తున్నాయి కానీ అతని తనయుని గురించి ఎలాంటి వార్త వినిపించడం లేదు.
చివరకు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరెవరి పేర్లో వినిపిస్తన్నాయి తప్ప మోక్షజ్ఞ పేరు ఏమాత్రం వినిపించడం లేదు. అయితే తరచూ మోక్షజ్ఞ తన మిత్రులతో ఫిలిం నగర్ లోనే, వయస్సు మించిన బరువు, భారీ శరీరాకృతి తో కనిపిస్తున్నాడని అంటున్నారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలంటే బరువు, శరీరాకృతి బాగా తగ్గించుకోవాలని టాక్ నడుస్తోంది.
అందుకే ఓ మూడు మాసాల్లో ఫర్ ఫెక్ట్ ఫిజిక్ తో వస్తే కనుక ఎన్టీఆర్ బయోపిక్ లో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లో చూపించవచ్చని డైరెక్టర్ క్రిష్ చెప్పినట్లు బోగట్టా. మరి అధిక బరువు తగ్గించుకుంటాడో లేదో వేచి చూడాలి.