పవన్ తో విడాకులు అయ్యాక ఎంత నరకయాతన పడిందో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న రేణు
టాలీవుడు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ ల జంట ఒకప్పుడు సంచలనం. ప్రేమాయణం, సహజీవనం, ఇద్దరు పిల్లలకు జననం, అంతలోనే ఎవరూ ఊహించని విధంగా విడాకులు … ఇవన్నీ అందరి కళ్ళముందే జరిగిపోయాయి. ఒకప్పుడు వాళ్ళని మించిన ప్రేమికులు లేరని అనుకునేవారు. విడాకులతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇక విడాకుల తర్వాత పవన్ మరో పెళ్లి చేసికుని,పిల్లల్ని కూడా కనడం తెల్సిందే. ఇక ,రేణు మాత్రం ఒంటరి జీవితం గడుపుతోంది. ఇప్పుడైతే,కాస్త నిలదొక్కుకుని,మరో వ్యక్తితో జీవితం పంచుకోవాలని భావిస్తోంది. అయితే పవన్ తో విడాకుల తర్వాత ఆమె నరకయాతన అనుభవించింది. పగ వాళ్లకు కూడా ఇన్ని కష్టాలు రాకూడని కోరుకుంది.
విడాకుల తర్వాత అకిరా, ఆద్యలను తీసుకుని పూణే వెళ్లిన రేణు అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించిందో ఎవరికీ తెలియదు. మొదటిసారి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో రేణు తానుపడిన కష్ట నష్టాలను వెల్లడించింది.అందరూ ఊహిస్తున్నట్టు విడాకుల తర్వాత తానేమి సొమ్ములు డిమాండ్ చేయలేదని, పిల్లలకు రావాల్సిందేదో కోర్టుద్వారా అందుకున్నానని రేణు చెప్పింది.
ఆ సమయంలో తనుకూడా సంపాదిస్తున్న ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయని, భర్త నుంచి విడివడ్డాక అండగా ఉంటారని పూణేలో తల్లిదండ్రుల దగ్గరకు వస్తే, ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తాను పూణే వెళ్ళేటప్పటికి , తన తండ్రి ఉద్యోగం పేరిట లండన్ వెళ్లిపోవడంతో, నా అనేవారు ఎవరూ లేక నానా కష్టాలు పడ్డానని ఆమె కంట తడి పెట్టుకుంది.
నిజానికి తల్లి దండ్రులు అండగా వుంటారనే అక్కడికి వస్తే, అక్కడికి వచ్చాక పరిస్థితులు పూర్తి భిన్నంగా దర్శనమిచ్చాయని ఆమె పేర్కొంది. ఇక కజిన్స్, ఫ్రెండ్స్ ఇలా ఎవరూ సహకరించకపోవడంతో ఇద్దరు పిల్లలతో నెట్టుకు రావడం శక్తికి మించిన భారం అయిందని ఆమె గతాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పుకొచ్చింది.
ఇక అదే సమయంలో తీవ్ర అనారోగ్యం పాలైతే, అందరూ ఉన్నా సరే, ఎవరూ లేని వాళ్ళలా పిల్లలిద్దరూ వేదనకు గురయ్యారని రేణు గద్గద స్వరంతో చెప్పింది. ఊపిరి తిత్తుల సమస్య నుంచి బయటపడుతున్న సమయంలో గుండెకు సంబంధించిన సమస్య రావడం,ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడం వలన పిల్లలిద్దరూ ఇంట్లో బిక్కుబిక్కు మంటూ గడిపారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.
ఆ తర్వాత నిలదొక్కుకుని మరాఠీ చిత్ర రంగంలో నిలదొక్కుకోవడం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానని రేణు వివరించింది. ఒంటరి జీవితం అనుభవిచడం ద్వారా సాటి స్త్రీల కష్టాలు ఎలా వుంటాయో కళ్ళకు కట్టినట్లు తెలిసిందని,అందుకే రేపొద్దున్న,తన కొడుకు అకిరా అయినా సరే గర్ల్ ఫ్రెండ్ తో సరిగ్గా లేకపోతే, అతన్నే తప్పుపడతానే గానీ,ఆమెను కాదని రేణు స్పష్టంచేసింది.
కాగా తాను రెండో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో ట్విట్టర్ లో ఎదురవుతున్న వేధింపులను కూడా ఆమె ప్రస్తావిస్తూ, ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మరొకరికి ఎందుకని, అయినా ప్రతి ఒక్కరూ తెర వెనుక యుద్ధం చేసే సైనికుల్లా మారిపోయారని రేణు ఘాటుగా వ్యాఖ్యానించింది.