బిగ్ బాస్ 2 లో గీతా మాధురి ఎలిమినేషన్ అవ్వదు….ఇది నమ్మలేని నిజం….ఎందుకో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ టు షోలో కంటెస్టెంట్ గా రాణిస్తున్న గాయని గీతామాధురి ఈ షో నుంచి ఎలిమినేట్ అవ్వదనే మాట వినిపిస్తుంటే, మరో పక్క ఎలిమినేషన్ జోన్ లో ఉందని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ విధంగా వచ్చే వార్తలు, చూపిస్తున్న వీడియోలు కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ టీమ్, నిర్వాహకులు ఆడుతున్న నాటకం అని వినిపించే కామెంట్స్. బయటకు వచ్చిన పార్టిసిపెంట్స్ చెప్పే మాటలను బట్టి చూస్తే ఇవి నిజమేనని అనిపిస్తోంది. ఇప్పుడు షోలో గీతా మధురిపై వస్తున్న కామెంట్స్, తేజస్వి,భానుశ్రీ వంటి మిగతావాళ్ళు ఆమెపై చేస్తున్న ఆరోపణలు ఆర్డర్ లో భాగమేనా అంటే అవుననే కామెంట్స్ వస్తున్నాయి. అసలు గీతా మాధురి ఎలిమినేషన్ ఎప్పటికీ ఉండదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియోలని అంటున్నారు.
తనీష్,తేజస్వి వంటి తారలు బిగ్ బాస్ షో లో ఉన్నప్పటికీ షో ఆరంభంలో గీతా మాధురి పేరు ఎక్కువ హైప్ అయింది. ఇంత హైప్ అవ్వటానికి కారణం గీతా రెమ్యునరేషన్ అని అంటున్నారు.ఈ షోకు ఆమె 15నుంచి 20లక్షలు వరకూ ఛార్జి చేస్తుందని టాక్. అయితే మిగిలినవాళ్ల విషయానికి వస్తే, వాళ్ళు మూవీ కోసం తీసుకునే సొమ్ముకి కొంత జోడించి ఇస్తారట.
అయితే గీతా మాధురికి అలా కాదని హౌస్ లో అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆమెకు ఎక్కువని టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే అమెరికాలో ఆమె పాల్గొనాల్సిన మూడు, నాలుగు షో లకు డుమ్మా కొట్టిందట. అందుకోసమే గీతా ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు.
కథ ఇలా ఉంటే ఇక ఆమె హౌస్ లో ఎలిమినేషన్ క్వశ్చన్ ఎలా వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే కాకుండా షో లో ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే, బిగ్ బాస్ తీసుకునే చర్యలు కఠినంగానే ఉంటాయి. అయితే గీతా మాధురి విషయంలో తరచూ వార్న్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆమెను జైలుకు పంపినా, ఎక్కువ సమయం అందులో ఉంచలేదు.
పైగా అది పెద్ద శిక్ష కూడా కాదు. అలాగే టాస్క్ ల విషయంలో ఆమెకు సర్ఫరైజ్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు. ఆవిధంగా బిగ్ బాస్ హౌస్ లో కాపాడబడుతూ వస్తున్నందున, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నందున ఆమె ఎలిమినేషన్ కాకుండా చూసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.