వరుణ్ సందేశ్ సంచలన నిర్ణయమే సినిమాలకు దూరం కావటానికి కారణం అయిందా?
హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న కుర్ర హీరో వరుణ్ సందేశ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అంతా ఓ మిస్టరీలా మారింది. ఇతని కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్రలో నివాసం ఉండేవారు. 1989జులై 21న ఒరిస్సా లోని రాయగడ లో జన్మించాడు. తర్వాత ఇతని తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిర పడ్డారు. వరుణ్ తాతయ్య ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీరామ చంద్రమూర్తి. ఇతని బాబాయ్ శ్రీధర్ నటుడు. తల్లి గృహిణి. తండ్రి హైదరాబాద్ లో ఐబిఎం లో ఉద్యోగం. ప్రమోషన్ మీద తండ్రి అమెరికా ట్రాన్స్ఫర్ అవ్వడంతో వరుణ్ న్యూజెర్సీలో పై చదువులు పూర్తిచేసాడు.అమెరికాలోనే పిజి సహా పలు కోర్సులు చేస్తున్న సమయంలో తన హ్యాపీడేస్ మూవీ కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్వహించిన ఆడిషన్స్ కి హాజరైన వరుణ్ అందులో ఎంపికై హీరో అయ్యాడు.
ఆ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం కూడా సూపర్ హిట్ అయింది. ఇలా రెండు వరుస హిట్స్ అయ్యాక ప్లాప్ లు తెచ్చుకున్నాడు. ఎవరైనా ఎప్పుడైనా, మరో చరిత్ర ,ఏమైంది ఈవేళ,డి ఫర్ దోపిడీ, పడ్డానండి ప్రేమలో మరి, లవకుశ,ఉదయం , ట్విస్ట్ లాంటి చిత్రాల్లో నటించిన ఇతనికి ఏదీ హిట్ కాలేదు.
ఇక లాభం లేదనుకున్న వరుణ్ సినిమాలకు దూరమై ప్రస్తుతం అమెరికాలో అమ్మా నాన్నలతో కల్సి ఉన్నాడు. ఇక వరుణ్, హీరోయిన్ రితిక ఓ చిత్రంలో కల్సి నటించి ప్రేమలో పడ్డారు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నారు. మూడు నెలలు అమెరికాలో హనీమూన్ జరుపుకున్న ఈ జంట తర్వాత ఇండియా వచ్చేసింది. ఇక వరుణ్ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రావడం,అవి తీవ్ర కలకలం రేపడం ఆ తర్వాత అది తప్పని తేలడం జరిగిపోయాయి.
నిజానికి వరుణ్ యూట్యూబ్ లో నటించడానికి అమెరికా వెళ్ళినపుడు రితిక ఒక్కర్తే ఫ్లాట్ లో ఉండేది. సడన్ గా ఓ నాలుగు నిద్ర మాత్రలు మింగేసిందట. ఆమె తల్లి తరపు బంధువులొచ్చి ఆమెను హాస్పిటల్ లో చేర్చారు. నిద్ర పట్టక పోవడం వల్లనే తాను నిద్ర మాత్రలు వేసుకున్నానే గానీ,ఆత్మహత్య ఉద్దేశ్యం తనకు లేదని రితిక స్పష్టం చేసింది.
అమెరికా వాతావరణానికి, ఇక్కడి వాతావరణానికి తేడా వచ్చి 48గంటలు నిద్ర పట్టకపోతే, నాలుగు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నానని, అదే సమయంలో అత్తయ్య, అమ్మ ఫోన్ చేస్తే, తీయకపోయేసరికి ఆసుపత్రికి తీసుకెళ్లారని రితిక వివరించింది. రితిక ఇలా చేసేసరికి, చిన్నా చితకా పాత్రలు అవకాశం వచ్చినా సరే, పెట్టె బేడా సర్దేసి అమెరికా వెళ్ళిపోయి అమ్మానాన్నల దగ్గర ఉంటున్న వరుణ్, మళ్ళీ ఏదైనా పెద్ద సినిమా ఛాన్స్ వస్తే, తప్ప ఇక హీరోగా చేయనని డిసైడ్ అయి, ఎక్కువగా కుటుంబంతో గడుపుతున్నాడు.