MoviesTollywood news in telugu

Tollywood:చిరంజీవి,బాలకృష్ణ,రాధ… నమ్మలేని నిజాలు బయట పడ్డాయి

Tollywood News:ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్. సినీ భాషలో చెప్పాలంటే ఓ రాధ, ఇద్దరు కృష్ణులు అన్నమాట. ఇదేమిటి అనుకుంటున్నారా?ఇక అసలు విషయానికి వస్తే, ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ స్టార్ డమ్ తెచ్చుకున్న చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అలాగే ఒకప్పుడు వీరిద్దరితో కల్సి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన రాధ వీరి ముగ్గురి మధ్య చోటుచేసుకున్న కామన్ విషయాలు గమనిస్తే,మరి అది యాదృచ్ఛికమో, ఏమో గానీ ఆసక్తికరంగా ఉంటాయి.

ఇంచుమించు వీరిద్దరి కెరీర్ ఒకసారే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం శక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఇప్పటికీ స్టార్ డమ్ కొనసాగిస్తున్నాడు.ప్రాణం ఖరీదు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి విలన్ వేషాలతో రాణిస్తూ అంచెలంచెలుగా అగ్ర హీరో అయ్యాడు.

ఇక బాలయ్య 1970 దశకంలో బాలనటుడిగా రంగప్రవేశం చేసి, తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సాహసమే జీవితం చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, అగ్ర హీరో అయ్యాడు.ఇక దశాబ్దాలుగా సినీ రంగానికి వీళ్ళిద్దరూ చేసిన సేవలు నిరుపమానం. జనరంజక చిత్రాల్లో పోటాపోటీగా నటించి,తమకు తామే సాటి అనిపించుకున్నారు.

ఒకదశలో వీరిద్దరి మధ్యా పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉండేది. సాంఘిక, జానపద, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో ముఖ్యంగా ఫ్యామిలీ,విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ తో బాలయ్య అలరించగా, ఫైట్లు, డాన్సులు వుండే యాక్షన్ మూవీస్,కామెడీ టచ్ గల వినోదాత్మక చిత్రాలతో చిరు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇక వీరిద్దరి సినిమాల్లో కథానాయికగా నటించిన అందాల భామ హీరోయిన్ రాధ జన్మ తహ మలయాళీ అయినా, తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. చిరుతో గుండా,నాగు, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా,కొండవీటి దొంగ,రాక్షసుడు,యముడికి మొగుడు,స్టేట్ రౌడీ,కొదమ సింహం వంటి చిత్రాల్లో చిరంజీవికి ధీటుగా రాధ నటించింది. ఇక బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, రాముడు భీముడు,దొంగరాముడు, రక్తాభిషేకం,వంటి చిత్రాలు పెద్ద హిట్స్ సాధించాయో వేరే చెప్పక్కర్లేదు.

ఇక మొదట్లో చిరు, బాలయ్య ల మధ్య అంతగా సఖ్యత ఉండేది కాదని టాలీవుడ్ లో గుసగుసలు విన్పించేవి. ముఖ్యంగా ఇద్దరి మధ్యా పోటా పోటీ సినిమాలు రావడంతో ఫాన్స్ మధ్య ఆవేశం రగిల్చేది. కానీ ఎందరు హీరోలొచ్చినా వీరి స్టార్ డమ్ చెక్కుచెదరలేదు. ఇక ఆ రోజుల్లో పరిస్థితికి భిన్నంగా ఇద్దరు ఎంతో ఫ్రెండ్లి గా మూవ్ అవుతున్నారు. పొరపాటున ఒకరు ఏదేన్నా అన్నప్పటికీ మరొకరు స్పోర్టివ్ గా తీసుకుని వివాదం పెద్దదవ్వకుండా సర్దేసుకుంటున్నారు.

ఇక ఆసక్తికర పోలిక కూడా ఇద్దరి మధ్యా వుంది. అదేమిటంటే ఇద్దరూ పాలిటిక్స్ లో ఉండడం. ఇక ఇద్దరికీ ముగ్గురేసి పిల్లలు. చిరుకి సుస్మిత, శ్రీజ అనే ఇద్దరు అమ్మాయిలు, రామ్ చరణ్ అనే ఓ అబ్బాయి. బాలయ్యకు కూడా బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు, మోక్షజ్ఞ అనే ఓ అబ్బాయి. ఇది యాదృచ్ఛమే అనుకోవాలి

ఎందుకంటే ఇద్దరికీ ఇద్దరేసి అమ్మాయిలు,ఒక్కో అబ్బాయి. ఇక వీరిద్దరి కూతుళ్ళూ కూడా సినీ రంగానికి దూరంగా ఉండడం కూడా కామన్ పాయింట్. చిరు కుమారుడు రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా వున్నాడు.

మరి వీరితో నటించిన రాధకు కూడా ముగ్గురు పిల్లలే అదికూడా ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు కావడం విశేషమే. ఈమె కెరీర్ ముగుస్తున్న దశలో రాజశేఖర్ అనే బిజినెస్ మాన్ ని పెళ్ళాడి సెటిల్ అయింది. అయితే పెద్ద కూతురు కార్తీక తమిళ, మలయాళ ,తెలుగు చిత్రాలతో అందరిని ఆకట్టుకుంటోంది.

రెండో అమ్మాయి తులసి కూడా తమిళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొడుకు విగ్నేష్ మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంటూ, తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. చిరు , బాలయ్య కుమారులు సినీ రంగంపై మోజు పడితే, కుమార్తెలు దూరంగా వున్నారు. మరి రాధ విషయంలో రివర్స్ లో ఆమె కూతుళ్లు ఇద్దరూ సినీ రంగంలోకి వస్తే, కొడుకు వ్యాపార రంగాన్ని ఎంచుకోవడం నిజంగా ఇంటరెస్టింగ్ విషయమే.