Movies

మెగాస్టార్ ని టార్గెట్ చేస్తున్న సూపర్ స్టార్ ? పోటీ తప్పదా?

రాజకీయాల నుంచి సినీ రంగానికి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150తో తన సత్తా ఏమిటో చాటి చెప్పిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ సైరా నర్సింహారెడ్డి . దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో తీసున్నా ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రచారం సాగింది. అయితే భారీ గ్రాఫిక్స్ కారణంగా వచ్చే సమ్మర్ లో రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఎంత లేదన్నా మార్చి చివరి వారంలోనే రిలీజ్ అవుతుందని ప్రచారం జోరందుకుంది.

ఇంతవరకూ సైరా సినిమా అప్ డేట్ ఇది అయితే, ఇక మరోవైపు సరిగ్గా అదే టైం కి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీని ఏప్రియల్ 5న రిలీజ్ చేయడానికి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి సన్నాహాల్లో వున్నారు. ఇది నిజమైతే కేవలం ఓ వారంలోగానే రెండు భారీ చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతాయని చెప్పవచ్చు . మరి ఇది ఇరు వర్గాలకు నష్టదాయకమని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే పెద్ద సినిమాల రిలీజ్ కి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలన్న ట్రేడ్ రూల్ పాటించకపోతే , విడుదలకు థియేటర్ల సమస్య ఉత్పన్నం అవుతుందని అంటున్నారు. ఇక రంగస్థలం మార్చి 30న విడుదలై ఎలాంటి సక్సెస్ ని సాధించిందో తెల్సిందే. అందుకే సైరా విడుదలకు కూడా మార్చి 30నే కన్ఫర్మ్ డేట్ గా పెట్టుకున్నాడట రామ్ చరణ్.

ఇలాంటి పరిస్థితుల్లో సైరాకు, మహేష్ 25వ సినిమాకు ఒక్కవారమే గ్యాప్ ఉంటుంది. కాగా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా సైరా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని టాక్. చిరు, అమితాబ్, నయనతార,తమన్నా తదితరులు సైరా లో నటిస్తుండగా, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారట. మొత్తానికి వచ్చే సమ్మర్ లో మెగాస్టార్, సూపర్ స్టార్ మూవీస్ విడుదల కాబోతున్నాయన్న మాట. అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి కావడంతో మరింత హీట్ ఎక్కబోతున్న అసలే సమ్మర్…