Movies

నాగ్ తో జోడి కట్టిన ‘సూపర్’ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

ఒక్క సినిమా చాలు కలకాలం గుర్తుండడానికి అన్నవిధంగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో నటించి అందరికీ గుర్తిండిపోయిన నటి ఆయేషా టాకియా. అవును,నాగార్జున హీరోగా వచ్చిన యాక్షన్ త్రిల్లర్ సూపర్ మూవీలో నటించిన ఈ ముంబై ముద్దుగుమ్మకి తొలి, చివరి చిత్రం కూడా అదే కావడం విశేషం. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపిస్తే ఒట్టు . సూపర్ మూవీలో సిరి పాత్రతో రక్తి కట్టించిన ఈ అమ్మడు బాగా బిజీ అయిపోతుందని క్రిటిక్స్ భావించినప్పటికీ ఎందుచేతనో టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇక 1986 ఏప్రియల్ 10న ముంబయిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ తండ్రి నిశిత టాకియా ఓ గుజరాతీ హిందూ. తల్లి ఫరీదా ముస్లిం. వీరిది ప్రేమ వివాహం.

ముంబయిలోని సెయింట్ అంథోని గర్ల్స్ హైస్కూల్ లో స్టడీ పూర్తిచేసిన అయేషా టాకియా కు 15ఏళ్ళ ప్రాయంలోనే మోడలింగ్ లో ఛాన్సులు వచ్చిపడడంతో చదువుకి స్వస్తి చెప్పేసింది. కాంప్లయిన్ యాడ్ లో ఐ యామ్ కాంప్లాన్ గాళ్ అని ముద్దుముద్దుగా చెప్పింది ఈమె. ఇక అదే యాడ్ లో కాంప్లయిన్ బాయ్ అని చెప్పింది బాలీవుడ్ హీరో షాయిద్ కపూర్. ఆ తర్వాత మ్యూజిక్ ఫీల్డ్ లో బిజీ అయింది.

ఇక 2004లో వచ్చిన టార్జాన్ ద వండర్ కార్ చిత్రంతో సినీ ఫీల్డ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కి ఆ సినిమా బాగుందన్న టాక్ తో బాలీవుడ్ లో మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి. 2005లో వచ్చిన షాదీ నెంబర్ వన్ ఆమె కెరీర్ లో మాంచి హిట్ అని చెప్పాలి. ఇక ఆ మూవీ చూసాకే పూరి జగన్నాధ్, సూపర్ మూవీలో నాగ్ సరసన ఎంపిక చేసాడు. ఇక ఆ తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన ఈమె బాలీవుడ్ లో రాణిస్తూ, ఓ పక్క సినిమాలు, మరో పక్క మ్యూజిక్ ఆల్బమ్ లతో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ఇక 2009లో సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ మూవీలో నటించి స్టార్ డమ్ ని అందుకుంది. తిరుగులేని రేంజ్ కి చేరిందని చెప్పాలి. ఆ మూవీ భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించి,అనేక రికార్డులను సొంతం చేసుకుంది. అదే ఏడాది ఓ రెస్టారెంట్ అధినేత ఫరర్ అజ్మీ ని పెళ్ళాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే ఆమెకు 23ఏళ్ళు.

అయితే అప్పటికే తల్లి నుంచి తండ్రి విడిపోవడంతో పెళ్ళికి దూరంగా ఉంచింది. ఇక పెళ్లి తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించిన ఈ సూపర్ భామ అయేషా పూర్తిగా సినిమాలకు దూరమైంది. 2014లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయేషా ఇప్పుడు కుటుంబానికి అంకితమైంది. భవిష్యత్తులో మంచి రోల్స్ ఉంటే నటిస్తానని అంటోంది.