Movies

టాప్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కి అవకాశాలు రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

యాంకర్ సుమ అంటే తెలియని వారు ఎవరు లేరు. ఆమె అంతలా తన యాంకరింగ్ తో పేరు తెచ్చుకుంది. ఆమె రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఉన్నా పరిచయాలతో రాజీవ్ కి అవకాశాలు ఇప్పించవచ్చు కదా అని అందరూ అంటారు. అయితే రాజీవ్ కి అవకాశాలు రాకపోవటానికి కారణం తెలుసుకుందాం. రాజీవ్ మంచి నటుడు. బుల్లితెర నుండి వెండితెరకు వచ్చాడు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్ నుండి వచ్చిన నటులలో చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సుమకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఖాళీ లేకుండా షో లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. అలాగే రాజీవ్ కి కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు.

అయితే రాజీవ్ వారిని కలిసినప్పుడు అవకాశాలు ఇవ్వమని అడగటం చెయ్యడట. వారిని కలిసినప్పుడు సినిమాల గురించి అసలు మాట్లాడడు. అవకాశాలు రావాలంటే నలుగురిలో మాట్లాడాలి. అలాగే అందరితోనూ టచ్ లో ఉండాలి. ఈ విషయం గురించి సుమ కూడా క్లాస్ పీకిందట. అయితే రాజీవ్ ప్రొఫెషన్ వేరు స్నేహం వేరు అని అంటాడు.

ఆలా అందరితో టచ్ లో ఉండటం తనకు కష్టమైన పని అని అంటాడు రాజీవ్. అయితే రాజీవ్ స్నేహితుడు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తన పాటి సినిమాలో రాజీవ్ కి అవకాశం ఇస్తూ ఉంటాడు. రాజీవ్ నటించిన చల్ సినిమాలు హిట్ అయ్యేయి.