కలర్స్ స్వాతి గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా….ఎవరు నమ్మలేని నిజాలు
టెలివిజన్ రంగంలో 16 ఏళ్ల వయస్సులో ఎంట్రీ ఇచ్చి,ఆ తర్వాత బిగ్ స్క్రీన్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాతి. మా టివిలో కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యి అదే పేరుతొ పాపులర్ అయింది. తెలుగులోనే కాదు తమిళ,మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ స్లిమ్ బ్యూటీ కెరీర్ ని క్రమంగా పెంచుకుంటోంది. ఇక 2008లో ప్యూర్ ఎంటర్ టైనర్ అష్టా చెమ్మా మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన స్వాతి కి తొలి చిత్రం ఏమిటంటే, కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన డేంజర్ మూవీ. స్వేట్లానా ఆమె అసలు పేరు.తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉన్న సమయంలో జన్మించిన స్వాతికి రష్యన్ భాషలోనే పేరు పెట్టారు.
ఆ తరువాత ముంబయి వచ్చిన స్వాతి కుటుంబం,అంతిమంగా వైజాగ్ లో సెటిల్ అయింది. స్టడీస్ లో ఎప్పుడూ ముందుండే స్వాతి ఎం బి బి ఎస్ సీటు వచ్చినా వెళ్లకుండా,బి.ఎస్సీ బయోటెక్నాలజీ చేసి,ఆ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లో పిజి పూర్తి చేసింది. చదువుకునే సమయంలో కలర్స్ ప్రోగ్రాంలో ఛాన్స్ రావడం ఒక ఎత్తు అయితే, అందులో పలువురు సినీ స్టార్స్ ని ఇంటర్య్వూ చేయడం వలన సినీమా వాళ్ళు పరిచయం అయ్యారు.
ఆ విధంగా డేంజర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్వాతి మొదట ఆడిషన్స్ కి తల్లితో కల్సి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ డైరెక్టర్ కృష్ణ వంశీ ని చూసి , సినిమా కథ చెబుతారా అని అడిగేసింది. అసలు ఆడిషన్స్ లో సెలెక్ట్ కాలేదు, ఇదేమిటి ఇలా అడుగుతోంది అనుకున్నారట. స్క్రీన్ టెస్ట్ లేకుండా కథ ఉంటుందా అని ఆశ్చర్య పోయాడట.
ఆ వెంటనే ఓ పేపర్ పై కెవి అని రాసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని కృష్ణవంశీ అడగడంతో, వెంటనే స్వాతి తల్లి తేరుకుని, మీరు ఏమేమి సినిమాలు తీశారండి అని అమాయకంగా అడగడంతో కృష్ణవంశీకి ఎక్కడో కాలింది. అసలు ఈమె ఎవరు తన గురించి అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసాడట.ముందు స్క్రీన్ టెస్ట్ ఆ తర్వాతే స్క్రిప్ట్ చెబుతా అని కృష్ణ వంశీ చెప్పేశాడట. స్క్రీన్ టెస్ట్ సెలెక్ట్ అయితే, స్క్రిప్ట్ చెబుతారా అంటూ తల్లి కన్నా అమాయకంగా అడిగిందట స్వాతి.
మొత్తానికి స్క్రీన్ టెస్ట్ ఆ తర్వాత ఆమె డేంజర్ లో నటించడం చకచకా జరిగిపోయాయి. డేంజర్ మూవీ తరవాత తన గురించి ఓ ఎం ఎం ఎస్ సర్క్యులేట్ అవుతోందని తెల్సి, కృష్ణ వంశీ జోక్యం చేసుకుని, సదరు వెబ్ సైట్ వాళ్ళతో మాట్లాడి, గట్టిగా వార్నింగ్ ఇచ్చారని,స్వాతి ఓ ఇంటర్య్వూలో చెప్పింది. దాంతో స్వాతి కి చెందిన రూమర్ వార్త లింక్ తొలగించారట.
ఇక అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ,అష్టా చెమ్మా, త్రిపుర, గోల్కొండ హైస్కూల్,కథ స్క్రీన్ ప్లే దర్శకుడు అప్పలరాజు,స్వామి రారా, కార్తికేయ వంటి మూవీస్ లో నటించి హిట్స్ అందుకుంది. ఇక తమిళంలో కూడా కలర్స్ స్వాతి హిట్స్ అందుకుని యూత్ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.