జ్ఞాపక శక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా చేస్తుంది
BlueBerry Health Benefits In telugu: ఒకప్పుడు అరుదుగా లభ్యం అయ్యే పండ్లు సీజనల్ గా చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. సీజన్ కానప్పుడు డ్రై రూపంలో లభ్యం అవుతున్నాయి. వీటిని తీసుకుంటే సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి ఉండవు. అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సూపర్ ఫుడ్స్ లో ఒకటైన బ్యూబెర్రీ చూడటానికి చిన్నగా ఉండే నీలి రంగు పండ్లు.
ఇవి చాలా తియ్యగా, రుచికరంగా ఉంటాయి. ఈ పండ్లు డ్రై గా విరివిగానే లభ్యం అవుతాయి. వీటిని రోజుకి 3 లేదా 4 తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగుపరచటానికి సహాయపడతాయి. బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంచటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు ఈ బ్యూబెర్రీ లలో ఉన్నాయి.
వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ ‘ఆక్సిడేటివ్ ఫైటో కెమికల్స్’, ఇలా జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం అని ఒక పరిశోదనలో తెలిసింది. రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కాకుండా కాపాడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతాయి.
బ్లూ బెర్రీస్ లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, ఫాస్ఫరస్ మరియు విటమిన్ K లు సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యానికి సహాయ పడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ అయిన ఆంథోసైనిన్స్ గుండెపోటు నుంచి కాపాడటం మరియు బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.
బ్లూ బెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బ్లూబెర్రీస్ యాంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ చర్యను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉండి రక్తంలో చక్కెర నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.