రోజుకో యాపిల్.. ఇలా తింటే రెట్టింపు ప్రయోజనాలు
రోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో యాపిల్ తినడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఇందులో ప్రొటీన్, ఐరన్, పీచు, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఇందులో ఉండే పైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది
యాపిల్ ఇనుముకు మంచి మూలం. ఇది రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.
పొటాషియం ఆరోగ్యకరమైన రక్తపోటు, సరైన కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
యాపిల్‌లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుస్తూ ఆరోగ్యవంతంగా మార్చుతాయి.
యాపిల్స్‌లోని కరిగే ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
యాపిల్స్‌లోని అధిక ఫైబర్, నీటి కంటెంట్ కారణంగా బరువు నిర్వహణకు దోహదపడుతుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.