బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా మహిళలు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
బీట్‌రూట్‌లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉండడం వల్ల రక్తనాళాలు విస్తరించి, రక్తప్రసరణ మెరుగవుతుంది.
బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేస్తాయి.
బీట్‌రూట్‌లోని ఐరన్, ఫోలేట్ జుట్టు వృద్ధికి సహాయపడతాయి. ఇది తల చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
బీట్‌రూట్ జ్యూస్‌లో సహజంగా ఉండే ఫోలేట్,ఇతర పౌష్టికాలు గర్భిణీ మహిళల శిశువుల అభివృద్ధికి ఉపయోగపడతాయి.
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌లు శరీరంలో ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తాయి.
బీట్‌రూట్ పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి మిక్సర్‌లో వేసి జ్యూస్ రూపంలో తీసుకోవాలి. రుచికి తగ్గట్టు అల్లం, నిమ్మరసం లేదా కొద్దిగా తేనె కలపవచ్చు.