నల్ల ద్రాక్ష తింటే కలిగే 10 లాభాలు ఇవే..
నల్లద్రాక్షలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది.
కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి
ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.
నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నల్లద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల ఆకలి తగ్గి బరువు తగ్గుతారు
నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
నల్లద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
నల్ల ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి.
ఇందులోని విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.