క్యాలీఫ్లవర్ తో ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే వదిలిపెట్టరు!

శీతాకాలంలో వచ్చే క్యాలీఫ్లవర్ మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలను ఇస్తుంది.

క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, విటమిన్ బీ6, విటమిన్ కే, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి

క్యాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

క్యాలీఫ్లవర్ లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

క్యాలీఫ్లవర్ లో ఉండే ఫైబర్ మన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడానికి దోహదం చేస్తుంది.

మన శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు పంపడానికి క్యాలీఫ్లవర్ దోహదం చేస్తుంది.

క్యాలీఫ్లవర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని భావించేవారు కాలిఫ్లవర్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిది.

క్యాలీఫ్లవర్ లో కోలిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని వ్యాధికారకాల పైన పోరాడడానికి తోడ్పడుతుంది.

సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి క్యాలీఫ్లవర్ మన చర్మాన్ని రక్షిస్తుంది.

క్యాలీఫ్లవర్ లో ఉండే సల్ఫర్ నైట్రేట్లు, యాంటీ ఆక్సిడేట్లు, గ్లూకోసినోలేట్స్ మన శరీరంలో అన్ని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి.