కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి మందులతో పాటు కొన్ని ఆహారాలను తినాలి
రోజుకు ఒక ఆపిల్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది
యాపిల్స్‌లో పెక్టిన్, పాలీఫెనాల్స్, ఫైటోస్టెరాల్స్ వంటి వివిధ సమ్మేళనాలు ఉంటాయి. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
రెండు మీడియం-సైజ్ ఆపిల్స్ తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను 10% వరకు తగ్గించవచ్చు.
యాపిల్స్‌లోని పాలీఫెనాల్స్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడతాయి.
యాపిల్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాపిల్స్‌లోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది.A
ఆపిల్ తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
ఎవరికైనా అధిక కొలెస్ట్రాల్ ఉంటే, కొవ్వును తగ్గించడం చాలా ముఖ్యం. ఆపిల్ ఈ పనిని సమర్ధవంతంగా చేస్తుంది.
ప్రతిరోజూ ఒక ఆపిల్ తినండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి