యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. యాలకులు పోషకాల నిధిగా చెప్పవచ్చు
యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
యాలకుల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ వంటివి సమృద్దిగా ఉంటాయి.
యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది.
యాలకుల నీటిని రోజూ తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు.
యలకుల్లో విటమిన్ C సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది
యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.A
ఆస్తమాను నివారించడంలో యాలకులు చాలా మేలు చేస్తాయి.
మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను శాశ్వతంగా తొలగించడంలో సహాయపడుతుంది.
యాలకులకు డిప్రెషన్‌తో పోరాడే ప్రత్యేక సామర్థ్యం ఉంది.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.