డయాబెటిస్ రోగులు ఉదయాన్నే ఈ పండు తింటే అద్భుతమే

డయాబెటిస్ ఉన్నవారు వెనకాముందు ఆలోచించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ శీతాకాలపు పండును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా జామపండు ప్రయోజనకరమైన పండు. జామ మాత్రమే కాదు, దాని ఆకులు మధుమేహానికి కూడా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జామ గ్లైసెమిక్ సూచిక 12-24 మధ్య ఉంటుంది.

జామపండులో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే అనేక విటమిన్లు ఉంటాయి.

జామలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, పొటాషియం, లైకోపీన్, యాంటీ-ఆక్సిడెంట్లు ఉన్నాయి.. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

డయాబెటిక్ పేషెంట్లు రోజులో 1 పెద్ద జామపండు తినవచ్చు. అల్పాహారంలో జామపండు తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

జామపండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

జామపండు తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది.

షుగర్ ఉన్నవారు పీచుపదార్థాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు తినాలని వైద్యులు చెప్పుతున్నారు