డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.
ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలోనే కనిపించిన డయాబెటిస్ ప్రస్తుతం 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుంది
ఖర్జూరంలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి సమృద్దిగా ఉంటాయి.
ఖర్జూరం తియ్యగా ఉండటం వలన చాలా మంది షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదనే ఆలోచనతో ఉంటారు.
షుగర్ ఉన్నవారు ఖర్జూరంను తీసుకోవచ్చు. దీనిలో పైబర్ షుగర్ పేషెంట్స్ కి మేలును చేస్తుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు.
రోజుకి రెండు ఖర్జూరాలు మించి తీసుకోకూడదు.
డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య ఉండేవాళ్లు ఖర్జూరం తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఖర్జూరాలతో అతిగా తీసుకోవద్దు. తక్కువగా తినండి. అయితే, వీటిని తినే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి.