పనస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, జీవవ్యవస్థ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

పనస గింజలలో విటమిన్ బి సమృద్దిగా ఉండుట వలన మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన కణాలను మెరుగుపరుస్తుంది.

పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పనస గింజల్లో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ శాతం అస్సలు ఉండదు. కాబట్టి డైటింగ్‌ చేసే వారు రోజూ పనస గింజలను తీసుకోవచ్చు.

పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం రక్త నాళాలను సడలించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది.

బలమైన ఎముకల కోసం కాల్షియంతో పాటు మెగ్నీషియం అధికంగా ఉండే ఈ గింజలు కాల్షియం శోషణను ప్రోత్సహించడం, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

పనస గింజలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పనస గింజలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.

పనస గింజలలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పనస గింజలలో ఉండే విటమిన్ సి చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.