చలికాలంలో ఈ పండు తింటే చాలా మంచిది..

నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.

నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నారింజలో డైటరీ ఫైబర్ (పీచు) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదపడుతుంది.

నారింజ పండ్లలో కనిపించే సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది

నారింజలో లుటిన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. కంటి చూపు మెరుగుదలకు సహాయపడతాయి.

ఆరెంజ్‌ ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ లెవెల్స్‌ ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల కడుపు సమస్యలు పెరుగుతాయి.

ఆరెంజ్‌లోని ఆమ్లాలు దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది

ఆరెంజ్‌లో చక్కెర అధికంగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా తీసుకోవాలి.