Raw Onion: పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.?
ఉల్లిపాయ ఆహారానికి రుచిని ఇస్తుంది. అంతే కాదు ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తుంది
ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.
ఉల్లిపాయల్లో శరీరానికి అవసరమైన పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ సి, విటమిన్ 6 ఉల్లిపాయల్లో పుష్కలంగా లభిస్తాయి..
ఉల్లిపాయ బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పడతాయి.
పచ్చి ఉల్లిపాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.
ఉల్లిపాయ ఎముకలను బలపరుస్తుంది. కాల్షియం శోషణను పెంచుతుంది
పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఉల్లిపాయలో ఉండే సేంద్రీయ సల్ఫర్ ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయల్లో ఇనులిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ గా పని చేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది
ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.