Thegalu: వీటి పేరేంటో తెలుసా? తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంత ఆరోగ్యం కూడా
తాటి టెంకలను నుంచి మొలకెత్తిన వాటిని తాటి తెగలు అంటారు.
తాటి తెగల్లో విటమిన్ B1,B2, B3, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
తాటి తేగల్లో విటమిన్లు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉండి అనారోగ్య సమస్యలను తరిమి కొడతాయి.
తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.
అలాగే ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి వారికి తాటి తేగలు మంచి ఎంపిక.
తాటి తేగలు జీర్ణ సమస్యలను తగ్గేలా చేయడమే కాకుండా ఎముకల బలాన్ని పెంచుతాయి.
అలా అని అధికంగా తినడం వల్ల కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మోతాదుగా తీసుకోవడం మంచిది.
వీటిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి.
చర్మం పై దురద, దద్దుర్లు, ఎరుపు వంటి సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.